కార్పొరేషన్, జూన్ 22: జిల్లాకు సంబంధించిన సమస్యలను ఇన్చార్జి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పట్టించుకోవడం లేదని, అసలు ఆయన ఇన్చార్జి మంత్రిగా ఉన్నట్టా.. లేనట్టా? అని నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు చల్ల హరిశంకర్ నిలదీశారు. శనివారం స్థానిక 37వ డివిజన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జిల్లా ఇన్చార్జి మంత్రిగా సమస్యలు పరిషరించడంలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విఫలమయ్యారని విమర్శించారు. అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడిచినా ఇప్పటి వరకు జిల్లా సమస్యలపై ఒక్కసారి కూడా సమీక్ష చేయలేదని ఆరోపించారు.
వేసవి కాలంలో తాగు, సాగునీటి సమస్యలు ఎదురైనా పట్టించుకోలేదని, ప్రస్తుతం వర్షకాలం ప్రారంభమవుతున్నదని, దీంతో సీజనల్ వ్యాధులు కూడా ప్రబలే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ దవాఖానల్లో పరిస్థితులు, ఇతర వ్యవస్థలపై కనీసం సమీక్ష కూడా ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తామని స్వీకరించిన దరఖాస్తులు బుట్ట దాఖలు చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆపారని, వీటిని వెంటనే ప్రారంభించేలా చూడాలన్నారు.
ఇప్పటికైనా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈ ప్రాంత సమస్యలు, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై రెండు నెలలకు ఒకసారి సమీక్ష నిర్వహించాలని కోరారు. కరీంనగర్‌కు ‘స్మార్ట్‌సిటీ’ ఘనత అప్పటి సీఎం కేసీఆర్, మాజీ ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్కే దక్కుతుందని, ఇందులో మరొకరి భాగస్వామ్యం లేదని తేల్చి చెప్పారు. తోటి కార్పొరేటర్ బండి సంజయ్ కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించడంపై బీఆర్ఎస్ నుంచి శుభాకాంక్షలు తెలుపుతున్నామని పేర్కొన్నారు. ఐదేళ్లలో ఎప్పుడూ అభివృద్ధి గురించి సంజయ్ పట్టించుకోలేదన్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు.
ఇప్పటికైనా కేంద్ర సహాయ మంత్రిగా నియోజకవర్గం, నగరాభివృద్ధికి నిధులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కరీంనగర్ టు హసన్‌పర్తి రైల్వే లైన్ తీసుకురావాలని, కరీంనగర్‌కు ట్రిపుల్ ఐటీ, పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈఎస్ఐ హాస్పిటల్స్ ఏర్పాటు చేయించాలని కోరారు. అలాగే నియోజకవర్గ పరిధిలోని నాలుగు జిల్లాలకు నవోదయ విద్యాలయాలను తీసుకురావాలన్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో 18 లక్షల మంది ఓటర్లు ఉన్నారని, వారిలో ఒక శాతం ఓటర్లు 18 వేల మందికి ఉపాధి కల్పించేందుకు పరిశ్రమలను తీసుకురావాలని కోరారు.
నత్తనడకన సాగుతున్న తీగలగుట్టపల్లి ఆర్వోబీ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలన్నారు. కరీంనగర్ నుంచి తిరుపతికి ప్రతిరోజూ రైలును నడిపించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్, బీజేపీ గత ప్రభుత్వం అని విమర్శలు చేయడం మానుకొని ప్రజల సమస్యల పరిష్కారానికి, అభివృద్ధి కోసం కృషి చేయాలని సూచించారు. 29 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు గంగుల కమలాకర్ వెంటే ఉంటారని తెలిపారు. సమావేశంలో బీఆర్ఎస్ నగర ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రశాంత్‌రెడ్డి, నాయకులు ఆరె రవి గౌడ్, చేతి చంద్రశేఖర్, సత్తినేని శ్రీనివాస్, సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.