Korutla | కోరుట్ల, ఏప్రిల్ 27 : కోరుట్ల పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం బీఆర్ఎస్ పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. ఈమేరకు పార్టీ సీనియర్ నాయకులు సింగిరెడ్డి నారాయణ రెడ్డి బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని స్థాపించి అన్ని వర్గాలను ఏకం చేశారని పేర్కొన్నారు. అభివృద్ధిలో తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ గా నిలిపిన ఘనత కేసీఆర్ కు దక్కుతుందన్నారు.
ఇప్పటికీ ఎప్పటికి తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ రక్ష అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పొట్ట సురేందర్, వసీం, మోసిన్, కొక్కెర వెంకటేష్, బీఆర్ఎస్ నాయకులు కాశిరెడ్డి మోహన్ రెడ్డి, సయ్యద్ ఫహీం, అన్వర్, సజ్జు, ఎలుగూరి కిరణ్, జాల వినోద్, గెల్లె శ్రీనివాస్, గంగాధర్, మిట్టపెళ్లి రాజశేఖర్, జంగిలి విజయ్, యాటం కృష్ణ, దశరథం, బింగి సంతోష్, అడెపు నరేష్, గరిగే రాజశేఖర్, వాంకర్ రాజ్ కుమార్, ఇమ్రాన్, రహీం పాషా, అంజయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.