Gangadhara | గంగాధర, ఏప్రిల్ 27 : కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని 33 గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ 25వ ఆవిర్భావ వేడుకలను మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ కూడలిలో గ్రామ శాఖ అధ్యక్షుడు బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించి, తెలంగాణ గీతాన్ని ఆలపించారు. అనంతరం గ్రామస్తులకు స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మన రాష్ట్రం, మన జెండా, మన ఆత్మ గౌరవం పేరుతో 25 ఏళ్ల క్రితం కేసీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిందని గుర్తు చేశారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ ఆధ్వర్యంలో సుదీర్ఘ పోరాటం, కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షతో ఆనాటి కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మేచినేని నవీన్ రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సాగి మహిపాల్ రావు, సింగిల్ విండో మాజీ చైర్మన్ దూలం బాలా గౌడ్, సర్పంచులు వేముల దామోదర్, కరబూజ తిరుపతి గౌడ్, చిలుముల సుధాకర్, నాయకులు కంకణాల విజేందర్ రెడ్డి, దూలం శంకర్ గౌడ్, రామిడి సురేందర్, మడ్లపల్లి గంగాధర్, ఎండి నజీర్, శ్రీమల్ల మేఘరాజు, పంజాల ఆంజనేయులు, ముక్కెర మల్లేశం, ఆకుల శంకరయ్య, రాసూరి మల్లేశం, బొల్లాడి శ్రీనివాస్ రెడ్డి, తోట మహిపాల్, వడ్లూరి ఆదిమల్లు, జోగు లక్ష్మీరాజం, ఆముదాల రమణారెడ్డి, తడిగొప్పుల రమేష్, గడ్డం స్వామి, రేగుల తిరుపతి, గంగాధర సంపత్, మామిడిపల్లి అఖిల్, సముద్రాల ఓంకార్, గుంటుకు ఆంజనేయులు, ఈర్ల మహిపాల్, జలంధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.