నేడు వీణవంకలో కేసీఆర్ ఆత్మీయ సమ్మేళనం
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శనివారం రాత్రి హుజూరాబాద్ నియోజకవర్గంలోని వీణవంకకు చేరుకున్నారు. మంచిర్యాల రోడ్ షో ముగించుకొని.. రోడ్డు మార్గాన రాత్రి 11గంటల తర్వాత మండలకేంద్రానికి వచ్చారు.
- శనివారం రాత్రి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసానికి చేరుకున్న అధినేత..
- మధ్యాహ్నం 20 వేల మందితో సమ్మేళనం
వీణవంక, మే 4 : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శనివారం రాత్రి హుజూరాబాద్ నియోజకవర్గంలోని వీణవంకకు చేరుకున్నారు. మంచిర్యాల రోడ్ షో ముగించుకొని.. రోడ్డు మార్గాన రాత్రి 11గంటల తర్వాత మండలకేంద్రానికి వచ్చారు. స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి నివాసంలో బస చేశారు. ఆదివారం మధ్యాహ్నం 2గంటలకు ఎమ్మెల్యే ఇంటి ఆవరణలోనే 20 వేల మంది పార్టీ శ్రేణులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు.
అందుకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేశారు. పార్టీ శ్రేణులతో మాట్లాడిన అనంతరం వీణవంకలో అట్టహాసంగా రోడ్‌షో నిర్వహిస్తారు. ఆ తర్వాత సాయంత్రం ఐదు గంటలకు ఇక్కడి నుంచి బయలు దేరి.. జగిత్యాలకు చేరుకుంటారు. అక్కడ నిర్వహించే రోడ్‌షోలో పాల్గొంటారు. నిజానికి ఈ నెల 2న జమ్మికుంటలో కేసీఆర్ రోడ్ షో జరగాలి. కానీ ఎన్నికల కమిషన్ 48 గంటలపాటు కేసీఆర్ ప్రచారంపై నిషేధం విధించడంతో అది వాయిదా పడిన విషయం తెలిసిందే.
దీంతో జమ్మికుంటలో కాకుండా.. ప్రస్తుతం ఎమ్మెల్యే ఇంటి ఆవరణలోనే ఆత్మీయ సమ్మేళనం నిర్వహించాలని నిర్ణయించారు. ఇక్కడ పార్టీ శ్రేణులను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగిస్తారు. అంతేకాకుండా, పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించిన తర్వాత తొలిసారిగా హుజూరాబాద్ నియోజకవర్గంలోని వీణవంకకు కేసీఆర్ వస్తుండగా, యావత్ పార్టీ శ్రేణులందరినీ ఒక దగ్గరికి చేర్చి అధినేతతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశం పార్టీ శ్రేణుల్లో కొత్త ఊపు తెస్తుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

