వేములవాడ, నవంబర్ 5: పేదల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని వేములవాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు పేర్కొన్నారు. వేములవాడ రాజన్న క్షేత్రం, పట్టణ అభివృద్ధే ప్రధాన ధ్యేయం గా పని చేస్తానని స్పష్టం చేశారు. ఆదివారం పట్టణంలోని 16, 18 వార్డు ప్రజల ఆత్మీయ సమ్మేళనాన్ని ఓ ఫంక్షన్హాల్లో నిర్వహించారు.
ఈ సందర్భంగా చల్మెడ మాట్లాడారు. వేములవాడ పట్టణంలో అర్హత ఉన్న ప్రతీ ఒకరికి డబుల్ బెడ్రూం ఇల్లు వచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బీడీ కార్మికుల పింఛన్లు, గృహలక్ష్మి పథకం, డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం వంటి అనేక సంక్షేమ పథకాల్లో మహిళలకు ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు. ప్రతి ఒకరూ కారు గుర్తుకు ఓటేసి ఆశీర్వదించాలని అభ్యర్థించారు.
ఇక్కడ జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, రూరల్ ఎంపీపీ బండ మల్లేశం యాదవ్, వార్డు కౌన్సిలర్లు కొండ పావని, కొం డ శ్రీలత, సీనియర్ నేత ఏనుగు మనోహర్‌రెడ్డి, పట్టణాధ్యక్షుడు పులం రాజు, కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్, మారం కుమార్, సిరిగిరి రామ్‌చందర్, యాచమనేని శ్రీనివాసరావు, నేతలు కొండ కనకయ్య, కొండ నర్సయ్య, గోపు బాలరాజు, గజ్జల రమేశ్, ముద్రకోల వెంకటేశం, గూడూరు మధు, హైమద్ పాషా, అక్రంపాషా, సంజీవ్, కొండ శేఖర్ పాల్గొన్నారు.