మంథని, అక్టోబర్ 29: ‘కార్యకర్తలు సైనికుల్లా పనిచేయండి..ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించండి..చేసిన పనులను చెప్పండి.’ అంటూ పెద్దపల్లి జడ్పీ చైర్మన్, మంథని బీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధూకర్ పిలుపునిచ్చారు. మంథని పట్టణం పోచమ్మవాడకు చెందిన సుమారు 20మంది, కమాన్పూర్ మండలం పెరపల్లి గ్రామానికి చెందిన యువకులు 50 మంది యువకులు, ముత్తారం మండలం అడవిశ్రీరాంపూర్కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ బర్ల చంద్రమౌళి, బిరుదు రాజయ్య, నాంసాని నారాయణ, బర్ల రూపేశ్, రుణీల్కుమార్, కొట్టే సంపత్, కొలిపాక కుమార్ ఆదివారం బీఆర్ఎస్లో చేరారు.
వీరికి మంథనిలో రాజగృహాలో పుట్ట మధూకర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ సభ్యత్వం కలిగిన ప్రతీ కార్యకర్తకు రూ. 2 లక్షల బీమా సౌకర్యాన్ని మనసున్న మహానేత సీఎం కేసీఆర్ అని కొనియాడారు. కాంగ్రెస్, బీజేపీలు కార్యకర్తలతో పని చేయించుకోవడం తప్పా వారి అభ్యున్నతి గురించి ఎన్నడూ ఆలోచన చేయలేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కష్టాల్లో పాలు పంచుకుంటూ, వారికి తగిన గుర్తింపు ఇస్తుందన్నారు. పనిచేసేవారిని కడుపులోపెట్టి దాచుకుంటామన్నారు.
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కార్యకర్తలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రామాల్లో బీఆర్ఎస్ని మరింత బలోపేతం చేయడంతో పాటు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగురవేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ, ఎంపీపీ జక్కుల ముత్తయ్య, జడ్పీటీసీ చెల్కల స్వర్ణలత అశోక్, వైస్ ఎంపీపీ సుధాటి రవీందర్రావు, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు నూనె కుమార్, సర్పంచ్ తుంగాని సమ్మయ్య, నాయకులు కొట్టే రమేష్, ఇనగంటి రామారావు, పోతుపెద్ది కిషన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.