BRS leaders | చిగురుమామిడి, జూన్ 13: మండలంలోని రేకొండ మాజీ ఎంపీటీసీ చాడ శోభ రెండు రోజుల క్రితం అనారోగ్యంతో మృతిచెందగా, వారి కుటుంబాన్ని బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం పరామర్శించారు. చాడ శోభ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మండల పరిషత్ లో ప్రజా ప్రతినిధులుగా వారితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. గ్రామ అభివృద్ధికి కృషి చేసేవారని, వివాదరహితులుగా పేరు సంపాదించుకున్నారని గుర్తు చేసుకున్నారు.
వారి మృతి గ్రామానికి తీరనిలోటని అన్నారు. వారి కుమారులు సింగిల్ విండో డైరెక్టర్ చాడ శ్రీధర్ రెడ్డి, చాడ మురళీధర్ రెడ్డిలను ఓదార్చారు. పరామర్శించిన వారిలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య, సింగిల్ విండో చైర్మన్ జంగా వెంకటరమణారెడ్డి, వైస్ చైర్మన్ కరివేద మహేందర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ వీరమల్ల శేఖర్, బీఆర్ఎస్ నాయకులు దుడ్డెల లక్ష్మీనారాయణ, నల్లాల రాజేందర్ రెడ్డి, తదితరులున్నారు.