BRS leaders | చిగురుమామిడి, సెప్టెంబర్ 8: చిగురుమామిడి మండలంలోని గునుకుల పల్లె లో బీఆర్ఎస్ మండల నాయకుడు కొమ్మెర మహేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి మాతృమూర్తి ఎల్లవ్వ మృతిచెందింది. కాగా బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య ఆధ్వర్యంలో నాయకులు వారి నివాసానికి వెళ్లి మృతదేహం వద్ద నివాళులర్పించారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.
బీఆర్ఎస్ అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు. నివాళులర్పించిన వారిలో గునుకులపల్లి, ఇందుర్తి బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు సన్నీల్ల మల్లేశం, ఎస్కే సిరాజ్, సింగిల్ విండో వైస్ చైర్మన్ కరివేద మహేందర్ రెడ్డి, నాయకులు కొమ్మెర భూపతిరెడ్డి, గుణుకుల రాజిరెడ్డి, గురుకుల రామ్ రెడ్డి, గునుకుల రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.