కరీంనగర్ కార్పొరేషన్/ విద్యానగర్, మే 7 : ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు ఆఫీస్‌పై బీజేపీ దాడిపై బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న కరీంనగర్లో విష సంస్కృతికి తెరతీశారని ఆగ్రహిస్తున్నారు. ఈ మేరకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ గురువారం సాయంత్రం టూటౌన్లో ఫిర్యాదు చేశారు. బండి సంజయ్ ప్రోద్భలంతోనే దాడి జరిగిందని, కౌశిక్‌రెడ్డిని చంపడానికి వచ్చిన వారిపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ దాడిలో 19 మంది పాల్గొన్నట్టు తెలిపారు.
ఆ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. అలాగే బీఆర్ఎస్ నాయకురాలు, సోషల్ మీడియా కార్యకర్త గోడిశాల పావనిగౌడ్ ఇంటిపై బీజేపీ, బీజేవైఎం కార్యకర్తలు గురువారం దాడికి యత్నించడంపై ఆమె ఆగ్రహించారు. బీఆర్ఎస్ నాయకులతో కలిసి వన్‌టౌన్ పోలీస్ సేష్టన్‌లో రూరల్ సీఐకి ఫిర్యాదు చేశారు.