Financial assistance | రుద్రంగి, జూలై 14 : రుద్రంగి మండల కేంద్రానికి చెందిన దాసరి భూమేష్ అనే యువకుడు వారం రోజల క్రితం గుండెపోటుతో మృతి చెందాడు. కాగా సెస్ డైరెక్టర్ ఆకుల గంగారాం, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దేగావత్ తిరుపతి, రుద్రంగి మండల బీఆర్ఎస్ నాయకులు సోమవారం మృతుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం అందించి అండగా నిలిచారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ మృతుడు భూమేషు భార్య, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారని, వారిది నిరుపేద కుటుంబం కావడంతో తమ వంతు సాయంగా రూ.10వేలు, నిత్యవసర సరుకులు అందించినట్లు చెప్పారు. భూమేష్ కుటుంబానికి బీఆర్ఎస్ ఎల్లప్పుడు అండగా ఉంటుందన్నారు. భూమేష్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
అనంతరం బోడ్ల రాములు మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు దయ్యాల కమలాకర్, నాయకులు గంగం మహేష్, మంచె రాజేశం, ఉప్పులూటి గణేష్, దుబ్బ రవి, కొడగంటి శ్యామ్, ఆకుల గంగాధర్, గొళ్లెం నర్సింగ్, ప్రశాంత్, నరేష్, పెద్దులు, గంగారెడ్డి, మణిదీప్తో పాటు తదితరులు పాల్గొన్నారు.