కరీంనగర్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) కార్పొరేషన్, డిసెంబర్ 17: లగచర్ల రైతుల కోసం బీఆర్ఎస్ నాయకులు ఆందోళన బాట పట్టారు. ఆ రైతులపై అక్రమ కేసులు పెట్టి, వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి జైళ్లలో నిర్బంధించడంపై నిరసనలు తెలిపారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు అందజేశారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు రక్షణ లేకుండా పోయిందని, మీరైనా స్పందించి రేవంత్ ప్రభుత్వ అరాచకాల నుంచి రైతులను కాపాడాలని అంబేద్కర్‌కు విన్నవించారు. ఆయాచోట్ల మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు పాల్గొని, కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ, అణచివేత వైఖరిపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
రైతుల ద్రోహి కాంగ్రెస్ అని, దేశానికే అన్నం పెట్టే రైతులను జైలుకు పంపిన దుర్మార్గమైన చరిత్ర రేవంత్‌ది అని తీవ్రంగా విమర్శించారు. ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడంగల్‌లోని లగచర్లలో పేద రైతుల భూములను బలవంతంగా లాకునేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని ఆరోపించారు. జీవనాధరమైన భూములు ఇవ్వకుంటే జైల్లో పెడుతారా..? అన్నం పెట్టే రైతులకు సంకెళ్లు వేస్తారా..? ప్రశ్నించారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అడుగడుగునా రాజ్యాంగాన్ని కాలరాస్తున్నదని విమర్శించారు. రైతులపై కేసులను వెంటనే ఎత్తివేసి, విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ప్రభుత్వ నిరంకుశ, అణిచివేత విధానాలకు వ్యతిరేకంగా తాము ఉద్యమిస్తామని స్పష్టం చేశారు.
జైల్లో పెడుతారా..?
పెద్దపల్లి, డిసెంబర్17: అన్నంపెట్టే భూములు ఇవ్వమన్నందుకు లగచర్ల రైతులను జైల్లో పెట్టడం అత్యంత నీచమైన చర్యఅని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మంగళవారం పెద్దపల్లిలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ, లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి, వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిదర్శనమన్నారు. రైతులపై నమోదు చేసిన కేసులను ఎత్తివేసి, వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
గుండెనొప్పితో బాధపడుతున్న రైతుకు సంకెళ్లు వేసి దవాఖానకు తీసుకెళ్లడం శోచనీయమన్నారు. రూ.2లక్షల రుణమాఫీ పూర్తిస్థాయిలో చేయకుండా, రైతుభరోసా, కౌలు రైతులకు రూ.12వేల సాయం ఇస్తామని నమ్మించి రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పెద్దపల్లి పట్టణాధ్యక్షుడు ఉప్పు రాజ్‌కుమార్, మండలాధ్యక్షుడు మారు లక్ష్మణ్, కౌన్సిలర్లు పూదరి చంద్రశేఖర్, నాంసానిసురేశ్బాబు, రేవల్లి స్వామి, లైసెట్టి భిక్షపతి, కో ఆప్షన్ సభ్యులు పహీమ్, రామగిరి చంద్రమౌళి, నాయకులు వైద శ్రీనివాస్, సలేంద్ర రాములు, పెంచాల శ్రీధర్, బెకం ప్రశాంత్, ఖదీర్‌ఖాన్, పెద్ది వెంకటేశ్, సయ్యద్ జావిద్ఉద్దీన్, వెన్నం రవీందర్, పల్లె మధు, గొట్టెముకుల శ్రీనివాస్, కుక మనోజ్, మొలుగూరి సాగర్, ఖాదర్, శ్రీనివాస్, ఆర్ ప్రేమ్ సాగర్, దామ సదయ్య, బొడ్డుపల్లి రాజేశం, నర్ల అంజయ్య, జనగామ సదయ్య, తదితరులు పాల్గొన్నారు.
అక్రమ కేసులు ఎత్తివేయాలి
గంగాధర, డిసెంబర్ 17: లగచర్ల రైతులపై ప్రభుత్వం అక్రమంగా పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేసి,వారిని జైలు నుంచి విడుదల చేయాలని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మంగళవారం బూరుగుపల్లిలో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సుంకె మాట్లాడుతూ, లగచర్ల రైతులపై థర్డ్ డిగ్రీ ప్రమోగించడం అమానవీయ చర్య అని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు కుటుంబాలను హింసించడం మానుకోవాలని, పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలన్నారు. అలాగే మధురానగర్ చౌరస్తాలో బీఆర్ఎస్ మండల నాయకులు అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమాల్లో ఏఎంసీ మాజీ చైర్మన్ సాగి మహిపాల్‌రావు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్‌రావు, మాజీ సర్పంచులు కంకణాల విజేందర్‌రెడ్డి, ఎండీ నజీర్, జోగు లక్ష్మీరాజం, నాయకులు దూలం శంకర్‌గౌడ్, గడ్డం స్వామి, ఆకుల మధుసూదన్, సముద్రాల అజయ్, ఐలయ్య, ఆనంద్, నగేశ్, జలంధర్‌రెడ్డి, నరేశ్, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.
అరాచకాల నుంచి కాపాడాలి
కార్పొరేషన్, డిసెంబర్ 17: రేవంత్‌రెడ్డి అరాచకాల నుంచి లగచర్ల రైతులను కాపాడాలని బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు డిమాండ్ చేశారు. మంగళవారం కరీంనగర్ కోర్టు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్‌తో కలిసి ఆయన వినతిపత్రం అందించారు. అనంతరం జీవీఆర్ మాట్లాడుతూ, మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నదని విమర్శించారు. స్వయంగా ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడంగల్‌లోని లగచర్లలో పేద దళిత, గిరిజన రైతుల భూములను బలవంతంగా లాకొనేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని ఆరోపించారు. ఫార్మా విలేజ్, ఇండస్ట్రియల్ కారిడార్ అంటూ మాయమాటలతో రైతుల భూములను అదానీ, తన అల్లుడికి అప్పజెప్పేందుకు కుట్రలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అరాచకాలను అందరూ వ్యతిరేకించాలన్నారు.
సీఎం సోదరుల ఆదేశాలతోనే పోలీసులు రైతులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని విమర్శించారు. గుండెపోటు వచ్చిందని దవాఖానకు తీసుకెళ్లిన రైతుకు బేడీలు వేయడం కాంగ్రెస్ అరాచక పాలనకు నిదర్శనమన్నారు. ఇలాంటి ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. వెంటనే లగచర్ల రైతులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్దఎత్తున నిరసనలు చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్, బీఆర్ఎస్ కార్పొరేటర్లు బండారి వేణు, కంసాల శ్రీనివాస్, గందె మాధవి మహేశ్, జంగిలి సాగర్, మహేశ్, కరీంనగర్ రూరల్ మండలాధ్యక్షుడు పెండ్యాల శ్యామ్‌సుందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్‌గౌడ్, నాయకులు చందు, ఆరె రవిగౌడ్, చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.
రేవంత్‌కు రైతులంటే గౌరవం లేదు
కోరుట్ల, డిసెంబర్ 17: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి రైతులంటే గౌరవం లేదని.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు తుంగలో తొక్కి వారిపై దమనకాండ కొనసాగిస్తున్నారని బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు విమర్శించారు. కేటీఆర్ పిలుపు మేరకు మంగళవారం కోరుట్లలోని కొత్త బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహనికి బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ, లగచర్లలో ఫార్మా కంపెనీ సాకుతో కాంగ్రెస్ సర్కారు రైతుల భూములు లాక్కొనేందుకు ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. అడ్డుపడిన రైతులపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేస్తున్నదని మండిపడ్డారు. కాంగ్రెస్‌కు ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరపడ్డాయన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం లగచర్ల రైతులను భేషరుతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు దారిశెట్టి రాజేశ్, ఫహీం, అంజయ్య, సురేందర్, ఇస్లాం, నగేశ్, తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌ది నిరంకుశ పాలన
గోదావరిఖని, డిసెంబర్ 17: దేశానికి అన్నంపెట్టే రైతులపై అక్రమంగా కేసులు పెట్టి.. వారి చేతులకు సంకెళ్లు వేయడం.. కాంగ్రెస్ ప్రభుత్వ నిరకుంశ పాలనకు నిదర్శనమని రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ విమర్శించారు. కేటీఆర్ పిలుపు మేరకు మంగళవారం పార్టీ శ్రేణులతో కలిసి గోదావరిఖనిలో అంబేద్కర్ విగ్రహానికి ఆయన వినతిపత్రం అందజేసి, మాట్లాడారు. తమ భూములు లాక్కోవద్దన్న లగచర్ల రైతులపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కాంగ్రెస్ రైతు వ్యతిరేకి ప్రభుత్వమని మండిపడ్డారు. రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఇక్కడ మాజీ జడ్పీటీసీ ఆముల నారాయణ, కార్పొరేటర్లు దాదం విజయ, కుమ్మరి శ్రీనివాస్, నాయకులు బొడ్డుపల్లి రవీందర్, శ్రీనివాస్, పర్లపల్లి రవి, జిమ్మి బాబు, నూతి తిరుపతి, తోకల రమేశ్, కుడుదుల శ్రీనివాస్, ముద్దసాని సంధ్యారెడ్డి, యాసర్ల తిమోతి, నిట్టూరి రాజు, వడ్లూరి రాములు, వెంకన్న, ఆవునూరి వెంకటేశ్, గుంపుల లక్ష్మి, స్వప్న, తదితరులు ఉన్నారు.
రైతులను విడుదల చేయాలి
మంథని, డిసెంబర్ 17: రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన చేస్తున్నదని, సీఎం రేవంత్‌రెడ్డితోపాటు ఆయన మంత్రివర్గం దోపిడే ధ్యేయంగా పని చేస్తున్నదని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ విమర్శించారు. తమకు అన్నం పెట్టే భూములను తీసుకోవద్దన్న లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టిందని మండిపడ్డారు. 35 రోజులుగా జైలులో మగ్గుతున్న రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ పిలుపు మేరకు మంగళవారం మంథని అంబేద్కర్చౌక్లోని అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పుట్ట మధూకర్ మాట్లాడుతూ, పదేండ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా, సుఖసంతోషాలతో గడిపారని గుర్తు చేశారు.
కానీ, మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంతో అన్నివర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన చెందారు. లగచర్ల రైతులకు దాదాపు 35 రోజులుగా బెయిల్ రాకుండా జైలులో పెట్టారని, వారి చేతికి సంకెళ్లు వేసి నరకయాతకు గురి చేస్తున్నారన్నారు. సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి తన అనుచరులతో కలిసి లగచర్లలోని రైతులపై ఇండ్లలోకి చొరబడి దాడులకు దిగడం దారుణమన్నారు. భూ సేకరణకు ఓ పద్ధతి ఉంటుందనే విషయాన్ని ప్రభుత్వం గమనించాలని, ఇప్పటికైనా స్పందించి రైతులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఎగోలపు శంకర్‌గౌడ్, తగరం శంకర్‌లాల్, మిర్యాల ప్రసాద్‌రావు, మాచిడి రాజుగౌడ్, ఆరెపల్లి కుమార్, ఆకుల రాజబాపు, మంథని లక్ష్మణ్, లింగయ్య, పుట్ట రాములు, తదితరులు పాల్గొన్నారు.
అన్నంపెట్టే రైతులకు సంకెళ్లా..?
జగిత్యాల టౌన్, డిసెంబర్ 17: దేశానికి అన్నంపెట్టే రైతులకు సంకెళ్లు వేస్తారా..? అని జగిత్యాల జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత సురేశ్ మండిపడ్డారు. మాయమాటలు చెబుతూ లగచర్లలో పేద రైతుల భూములను బలవంతంగా లాక్కొనేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని ఆగ్రహించారు. ఆ భూములను అదానీకి, తన అల్లుడికి అప్పజెప్పేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అడుగడుగునా రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నదని విమర్శించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మంగళవారం జగిత్యాల తహసీల్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి బీఆర్ఎస్ జిల్లా నాయకులతో కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సీఎం సోదరులు కొడంగల్ నియోజకవర్గాన్ని తమ జాగీరుగా భావిస్తున్నారని, దళిత గిరిజన రైతులను అణిచివేస్తున్నారని విమర్శించారు. రైతులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి, వారికి బేడీలు వేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.
ఇప్పటికైనా రైతులను వేధింపుల నుంచి కాపాడాలని, జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు గట్టు సతీశ్, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ హరిచరణ్‌రావు, ఏఎంసీ మాజీ చైర్పర్సన్ శీలం ప్రియాంక ప్రవీణ్, అర్బన్, రూరల్ మండలాల అధ్యక్షులు తుమ్మ గంగాధర్, ఆనందరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి నందరావు, పట్టణ ఉపాధ్యక్షుడు వొల్ల మల్లేశం, బీఆర్ఎస్ కౌన్సిలర్లు దేవేందర్ నాయక్, ఆవారి శివకేసరి బాబు, నాయకులు ఎల్లాల దామోదర్‌రావు, చిట్ల రమణ, వెంకటేశ్వరరావు, గంగారడ్డి, హరీశ్, సనీత్రావు, ప్రణయ్, నగేశ్, ప్రతాప్, గంగారెడ్డి, భగవాన్సాయి, చింతల గంగాధర్, రిజ్వాన్, నక్క గంగాధర్, నాయకులు పాల్గొన్నారు.