Sarangapur | సారంగాపూర్, ఫిబ్రవరి 1 : తెలంగాణ రాష్ట్ర సాధకుడు తొలిముఖ్య ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు సీట్ నోటీలు ఇవ్వడంపై సారంగాపూర్, బీర్పూర్ మండలాల బీఆర్ఎస్ నాయకులు ఆయా గ్రామాల్లో ఆదివారం నిరన కార్యక్రమాలను చేపట్టారు. కేసీఆర్ పై రాజకీయ కక్షతో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న వేధింపులను నిరసిస్తు రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు ఆయా గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకుల నిరసన కార్యక్రమాలను చేపట్టారు.
మండలంలోని పెంబట్ల గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తేలు రాజు ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేస్తున్న సమయంలో అక్కడకు చేరుకున్న పోలీసులు అడ్డుకుని బీఆర్ఎస్ నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్ వాహనంలో పోలీస్ స్టేషన్ కు తరలించారు. మండలంలోని బట్టపల్లి గ్రామంలో టీఆర్ఎస్ నాయకులు సీఎం దిష్ట బొమ్మను దహనం చేసిన నిరసనలు తెలిపారు. రేచపల్లి గ్రామంలో తెలంగాణతల్లి విగ్రహం వద్ద బీఅర్ఎస్ నాయకులు నినాదాలు చేస్తు నిరసనలు తెలిపారు.
లచ్చక్కపేట గ్రామంలో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి ఆనంతుల గంగారెడ్డి ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై బైటాయించి నిరసనలు తెలిపారు. బీర్ పూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు నిరసనలు వ్యక్త చేసి సీఎం దిష్టిబొమ్మను దహనం చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. మండలంలోని నర్సింహులపల్లి, ఇందిరనగర్ గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనలు వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానలను ప్రజలు గమనిస్తున్నారని రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠవ చెప్పుతారని నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వ విధాలపై మడ్డిపడ్డారు.
కేసీఆర్ పై కక్షసాధింపుతోనే ఇదంత చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమాల్లో సారంగాపూర్, బీర్ పూర్ మండలాల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తేలు రాజు, నేరెళ్ల సుమన్ గౌడ్, ప్రధాన కార్యదర్శి అనంతుల గంగారెడ్డి, కిషన్, మాజీ జడ్పీటీసీ కొల్యుల రమణ, మాజీ సింగిల్ విండో చైర్మెన్ మెరుగు రాజేశం, నాయకులు ఓడ్నాల జగన్, అజ్మీర శ్రీనివాస్, బుచ్చిమల్లు, సాతాల్ల రమేష్, బందెల రవి, బైరవేని మహేష్. గోడశెట్టి రాజు, కురుమ రాయమల్లు, రాగిల్ల గంగమల్లు, మధునాయక్, మథన్ కుమార్, పూదరి మనోజ్, మర్రి గంగన్న, పాంపర్తి రంజిత్, మర్రిపెల్లి శేఖర్, బదినేని రవి, అరవింద్, బండారి వెంకటేష్, భాస్కర్ నాయక్, సుమన్ నాయక్, వేణు, సాంబారి గంగాధర్, జలంధర్, అనుపురం శ్రీను. బాసమల్ల రాజనర్సు, అనుపురం చిన్న గంగారాం, మల్లయ్య, సుధాకర్, మల్లేశం, రవి, గంగాధర్, రామన్న, సుదర్శన్, ప్రభాకర్, కొమురెల్లి తదితరులు పాల్గొన్నారు.