ఎల్లారెడ్డిపేట, మే 9: పాకిస్థాన్ కాల్పుల్లో మృతిచెందిన ఆర్మీ జవాన్ మురళీ నాయక్‌కు బీఆర్ఎస్ నాయకులు నివాళులర్పించారు. శుక్రవారం ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, నాయకులు కలిసి మురళీ నాయక్ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఇక్కడ మాజీ జడ్పీటీసీ చీటి లక్ష్మణ్ రావు, పీఏసీఎస్ చైర్మన్ గుండారాపు కృష్ణారెడ్డి,సెస్ డైరెక్టర్ వరుస కృష్ణహరి, నాయకులు పిల్లి కిషన్, బీమేష్, రాజు నాయక్, నర్సింహులు, రాజిరెడ్డి, సుధాకర్ రావు, సీత్యనాయక్, రాము, కళ్యాణ్, బంటి ఉన్నారు.