సిరిసిల్ల టౌన్, జనవరి 4: హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్‌ను గురువారం సిరిసిల్లకు చెందిన బీఆర్ఎస్ నాయకులు మర్యాద పూర్వకంగా కలిశా రు. ఈ సందర్భంగా సిరిసిల్ల పట్టణశాఖ బీఆర్ఎస్ అధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్‌ను కేటీఆర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం ఈ క్యాలెండర్‌ను నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు ఆవిష్కరించారు. ఇక్కడ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షు డు తోట ఆగయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్, మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, నాయకులు ఉన్నారు.