చొప్పదండి, జనవరి 14: గంగాధర మండలం బూరుగుపల్లిలోని నివాసంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ను శనివారం చొప్పదండి మండల బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సంక్రాంతి పండుగను నియోజకవర్గ ప్రజలు సంతోషంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం చుక్కారెడ్డి, వైస్ చైర్మన్ చీకట్ల రాజశేఖర్, సర్పంచ్ పెద్ది శంకర్, కౌన్సిలర్ మాడూరి శ్రీనివాస్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్‌రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఏనుగు స్వామిరెడ్డి, యువరాజు, మధు, బీఆర్ఎస్ నాయకులు మాచర్ల వినయ్, బందారపు అజయ్‌కుమార్‌గౌడ్, తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్, గాండ్ల లక్ష్మణ్, దండె కృష్ణ, మంద అంజయ్య, తిరుపతిరెడ్డి తదితరులు ఉన్నారు.
ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ను బీఆర్ఎస్ మండల నాయకులు బూరుగుపల్లిలోని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యేకు పుష్పగుచ్ఛం అందజేసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఇక్కడ గంగాధర మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సాగి మహిపాల్‌రావు, మాజీ ఎంపీపీ గంగాధర శంకర్, ఎంపీటీసీ కోలపురం లక్ష్మణ్, నాయకుడు ఆరె రాజశేఖర్ తదితరులు ఉన్నారు.
ఎమ్మెల్యేకు సత్కారం
పట్టణంలోని 6వ వార్డు అభివృద్ధికి నిధులు మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ కౌన్సిలర్ వడ్లూరి గంగరాజు, నాయకులు శనివారం గంగాధర మండలం బూరుగుపల్లిలోని నివాసంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ మాజీ ఎంపీటీసీ వడ్లూరి శోభన్‌బాబు, నాయకులు వడ్లూరి వెంకటస్వామి, వడ్లూరి శ్రీనివాస్, కల్లెపల్లి పవన్, వడ్లూరి జానీ, కోదాటి రాజయ్య, కల్లెపల్లి రాజేందర్ తదితరులు ఉన్నారు.