నాంపల్లి క్రిమినల్ కోర్టులు, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ) : కొత్తగూడెం పోలీస్స్టేషన్లో నమోదైన కేసు విచారణకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బుధవారం నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. 2022 జనవరి4న జీఆర్ బస్తీ ప్రభుత్వ దవాఖానాలో కొవిడ్ నిబంధనలు పాటించకుండా ప్రెస్మీట్లో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారని భట్టితోపాటు ఆరుగురు కాంగ్రెస్ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
41-ఏ నోటీసులు జారీ చేశారు. సమన్లు అందుకున్న డిప్యూటీ సీఎంతోపాటు ఆరుగురు కాంగ్రెస్ నేతలు కోర్టుకు హాజరయ్యారు. విచారణను వచ్చేనెల 21కి వాయిదా వేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.