హనుమకొండ, సెప్టెంబర్ 23: వరంగల్‌లోని ఎంజీఎం దవాఖాన సందర్శన సందర్భంగా పోలీసుల దాడిలో గాయపడిన ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్భాసర్తో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం రాత్రి ఫోన్లో మాట్లాడారు. దాస్యం ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగించాలని, ప్రజలకు అండగా బీఆర్ఎస్ ఉంటుందని భరోసా కల్పించారు.
‘తమ్ముడు వినయ్.. ఉద్యమ నాటి గుర్తులను మళ్లీ గుర్తుచేశావు’ అని కేసీఆర్ అన్నారని దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. కాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సైతం వినయ్భాసర్ను ఫోన్లో పరామర్శించి ఆరోగ్యంపై ఆరా తీశారు.