చిగురుమామిడి, ఆగస్టు 24: చిగురుమామిడి మండలంలోని నవాబుపేట గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్తలు మట్టెల బాలయ్య, దండి రంజిత్ లు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. కాగా వారి కుటుంబాలను బీఆర్ఎస్ జిల్లా నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య ఆదివారం పరామర్శించారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.
బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని వారికి మనోధైర్యం నింపారు. వీరి వెంట మండల నాయకులు అనుమాండ్ల సత్యనారాయణ, బోయిని మనోజ్ కుమార్, గ్రామ శాఖ అధ్యక్షుడు పిల్లి వేణు, నాయకులు మద్దెల రమేష్, పోతరరేణి ఆగయ్య, దూరిశెట్టి రమేష్, కిష్టారెడ్డి, శ్రీనివాస్,గణేష్, వెంకటేష్ తదితరులున్నారు.