చిగురుమామిడి, ఏప్రిల్ 01: ప్రభుత్వ వైఫల్యంతో ఎండిపోయిన వరి పంటలను బీఆర్ఎస్ చిగురుమామిడి మండల శాఖ అధ్యక్షుడు మామిడి అంజయ్య ఆధ్వర్యంలో నాయకులు బుధవారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని గాగిరెడ్డిపల్లెలో పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పూర్తిస్థాయిలో భూగర్భ జలాలు ఎండిపోవడంతో బావులు బోర్లు అడుగంటి పోయాయన్నారు. పంటలు పూర్తిగా ఎండిపోయాయని అన్నారు. గత ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం తోటపల్లి రిజర్వాయర్ ద్వారా కాలువల ద్వారా నీటిని అందించేందుకు సర్వే చేపట్టినట్లు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడవ సంవత్సరం నడుస్తున్నప్పటికీ ఇంకా రైతుల సంక్షేమం కోసం దృష్టి సారించడం లేదని అన్నారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకొని నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. పంటలను పరిశీలించిన వారిలో మాజీ సర్పంచ్ సన్నీల వెంకటేష్, ఉప సర్పంచ్ నరేందర్ రెడ్డి, సామాజిక సంఘ సేవకుడు మంద శ్రీనివాస్, బిఆర్ఎస్ నాయకులు మానస, సతీష్, సురేష్, శ్రీనివాస్, వెంకటేష్, సదానందం రాజయ్య, లచ్చయ్య, బాబు తదితరులున్నారు.