silver jubilee celebration | సిరిసిల్ల టౌన్, ఏప్రిల్ 23: చలో వరంగల్ సభను విజయవంతం చేయడంలో భాగంగా సిరిసిల్లలో బీఆర్ఎస్ నాయకులు తరహాలో ప్రచారం చేపట్టారు. జిల్లా కేంద్రంలోని 37 వ వార్డులో స్థానిక మాజీ కౌన్సిలర్ దిడ్డి మాధవి ఆధ్వర్యంలో డప్పు చప్పుల్ల మధ్య బుధవారం ఇంటింటికి వెళ్లి బొట్టు పెడుతూ ఆహ్వాన పత్రికలకు అందజేస్తూ కేసీఆర్ సభకు తరలిరావాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి గూడూరు ప్రవీణ్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ నాయకత్వంలోనే సిరిసిల్ల నేతన్నల అభ్యున్నతి జరిగిందన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏర్పడింది తెలంగాణ రాష్ట్రం కోసం అని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయిన బీఆర్ఎస్ పార్టీ రజితోత్సవ సభకు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు దిడ్డి రాజు, వేముల తిరుపతి, తదితర నాయకులు పాల్గొన్నారు.