Odela | ఓదెల, ఆగస్టు 28 : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడిగా నియామకమైన గోశిక స్వామిని బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం సన్మానించారు. ఓదెల మండలం మడక గ్రామంలో నూతనంగా ఓదెల మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడిగా ఎన్నికైన స్వామిని శాలువాతో సన్మానం చేసిన అభినందించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు మ్యాడగోని శ్రీకాంత్ గౌడ్, మ్యాడగోని శ్రీనివాస్ గౌడ్, గిద్దమారి రమేష్, తుడి సంపత్, పేరవేన సతీష్, మ్యాడగొని రాజు, ఎలుకపల్లి దుర్గయ్య, రాజోజుల సత్యం, మ్యాకల లక్ష్మయ్య, లింగయ్య, లక్ష్మయ్య, అసంపల్లి సురేందర్, గూడెల్లి కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.