హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): వ్యవసాయశాఖలో నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు సాధించిన అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఎమ్మెల్యే మదన్మోహన్రావు ప్రశ్నించారు. తక్షణమే వారిని ఉద్యోగాల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
శుక్రవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ నకిలీ అధికారుల నియామకాలు వెలుగులోకి వచ్చినప్పటికీ వారిని ఉద్యోగాల నుంచి తొలగించకపోగా, ప్రమోషన్లు ఇవ్వడంపై విస్మయం వ్యక్తంచేశారు.