హైదరాబాద్, సెప్టెంబర్ 11(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో 22A పేరుతో సామాన్యులు, రైతుల ఆస్తులపై వారి హకులను కాలరాస్తూ.. రేవంత్‌రెడ్డి సర్కార్ నయా భూ దోపిడీకి పాల్పడుతున్నదని బీఆర్ఎస్ నేత మన్నె గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. తమ వ్యాపారాల కోసం ఇటు రేవంత్‌రెడ్డి కుటుంబం, అటు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పోటీపడి రాష్ట్ర భూములను కాజేస్తున్నారని శుక్రవారం ఒక ప్రకటనలో ఆరోపించారు.
ఈ ఇద్దరి భూ దాహం, రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం 1.01 కోట్ల ఎకరాల భూమిని 22ఏ లో పెట్టారని విమర్శించారు. పకా ప్లానింగ్ ప్రకారం చేసిన కుట్ర అని మండిపడ్డారు. నిషేధిత భూములపై బీఆర్ఎస్ అసెంబ్లీలో నిలదీస్తుందని బయటపడి, బీఆర్ఎస్ సభ్యులు సభకు రాకుండా కుట్రలు చేశారని తెలిపారు. తెలంగాణ ప్రజలను నిలువునా ముంచుతున్న రేవంత్ సర్కార్‌ను గద్దె దించేందుకు ప్రజలు సిద్ధమవుతున్నట్టు హెచ్చరించారు.