VOA’s | వీవోఏల నిరవధిక సమ్మెకు బీఆర్ఎస్ నేతల మద్దతు
గత 11 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న వీవోఏలకు మద్దతుగా బీఆర్ఎస్ తంగళ్ళపల్లి మండల నాయకులు వారి నిరాహార దీక్షకు సోమవారం మద్దతు తెలిపారు.
VOA’s | తంగళ్లపల్లి, జూన్ 1 : గత 11 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న వీవోఏలకు మద్దతుగా బీఆర్ఎస్ తంగళ్ళపల్లి మండల నాయకులు వారి నిరాహార దీక్షకు సోమవారం మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు గజ భీంకార్ రాజన్న మాట్లాడుతూ వీవోఏల న్యాయమైన డిమాండ్ లను ప్రభుత్వం మొండి వైఖరి వీడి వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం వారి ప్రాథమిక హక్కు అని పట్టణాలలో లాగా సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలని అర్హులైన వారికి సిఏ లుగా పదోన్నతి కల్పించాలని అన్నారు.
సాధారణ ఆరోగ్య భీమా కల్పించాలని, 58వ జీవో సవరణ చేయాలని, ప్రజా పాలనన అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే వీవోఎ ల డిమాండ్ ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీఆర్ఎస్ వీవోఏల హక్కుల సాధనకు ఉద్యమిస్తుందని తెలిపారు. ఈ ధర్నాలో సిరిసిల్ల పాక్స్ చైర్మన్ బండి దేవదాస్ గౌడ్, మాజీ జెడ్పీటీసీ కోడి అంతయ్య, నేతలు పడిగల రాజు, సురభి నవీన్ రావ్, మీసాల కృష్ణ, మల్లారపు నరేష్, బండి జగన్, మోతే మహేష్, దొంతునేని చందర్ రావు, ఆసాని శ్రీకాంత్ రెడ్డి, కందుకూరి రాములు, ఇమ్మనేని అమర్ రావు, అలవాల సాయి, మాసిపెద్ది శ్రీకాంత్ రావు, భానుమూర్తి, ఒగ్గు బాలలింగం, అబు బకర్, రమేష్, భిక్షపతి, వీవోఏల ప్రతినిధులు విజయ, రేణుక, భాగ్య తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

