BRS : కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. అసెంబ్లీ ఎదుట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై పోలీసులు అనుచిత ప్రవర్తన, అక్రమ అరెస్టులకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల గులాబీ నాయకులు మెరుపు ధర్నా నిర్వహించారు. అనంతరం.. సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన – వైఫల్యాలను ఎండగట్టాలనుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై పోలీసుల దాడిని బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా ఖండించాయి. అసెంబ్లీ గేటు ఎదుట మహిళా ఎమ్మెల్యేలపై అమానుషంగా ప్రవర్తించిన పోలీసుల వైఖరిని ఖండిస్తూ కరీంనగర్, వేములవాడ ప్రధాన రహదారిపై కొదురుపాక చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించారు. అనంతరం.. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు నాయకులు.