GANGADHARA | గంగాధర, మార్చి 30: మంగపేట గ్రామపంచాయతీ పరిధిలోని తుర్కాశినగర్ లో రంజాన్ మాసం సందర్భంగా ఉపవాస దీక్ష చేస్తున్న 50 మంది ముస్లిం కుటుంబాలకు నెలకు సరిపడా నిత్యావసర సరుకులను బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కొత్త జయపాల్ రెడ్డి పంపించారు. మంగపేట గ్రామపంచాయతీ వద్ద జయపాల్ రెడ్డి మిత్రమండలి సభ్యులు నిత్యవసర సరుకులను ముస్లిం సోదరులకు ఆదివారం అందజేశారు.
ఈ సందర్భంగా మజీద్ కమిటీ అధ్యక్షుడు సయ్యద్ ఇమామ్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్ష చేస్తున్న ముస్లింలకు అత్యవసర సరుకులను పంపించి కొత్త జయపాల్ రెడ్డి తన గొప్ప మనసును చాటుకున్నారని కొనియాడారు. పది రోజుల క్రితం మసీదుకు సౌండ్ సిస్టం అందజేయాలని కోరగానే రూ.30 వేల తో కొత్త సౌండ్ సిస్టం విరాళంగా అందజేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
నిత్యవసర సరుకులు అందజేసిన కొత్త జయపాల్ రెడ్డికి మజీద్ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మిత్రమండలి సభ్యుల కంకణాల విజేందర్ రెడ్డి, మేచినేని నవీన్ రావు, పొన్నం పర్శరాములు, గుర్రం రాజిరెడ్డి, బైరి గంగారెడ్డి, పెంచాల మల్లేశం, రాసురి సంజీవ్, వైద భరత్, లింగాల లింగయ్య, నల్ల హనుమంతు, నర్సింహా రెడ్డి, శేఖర్, మజీద్ కమిటీ సభ్యులు షేక్ కాసీం, సయ్యద్ హుస్సేన్, సయ్యద్ కరీం, సయ్యద్ బడ కరీం తదితరులు పాల్గొన్నారు.