మెట్పల్లి టౌన్, నవంబర్ 26 : పంచాయతీ ఎన్నికల్లో బాగా కష్టపడుదామని, మ నోళ్లను గెలిపించుకుందామని గులాబీ శ్రే ణులకు బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు, కో రుట్ల మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పిలుపునిచ్చారు. మెట్పల్లి పట్టణంలోని కార్యాలయంలో బుధవారం కో రుట్ల నియోజకవర్గంలోని అన్ని మండలా ల ముఖ్య నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రే ణులకు దిశానిర్దేశం చేశారు.
కేసీఆర్ హ యాంలోనే రాష్ట్రం అభివద్ధి చెందిందని, ని యోజకవర్గంలోని ప్రతి గ్రామాన్నీ సుందరంగా తీర్చిదిద్దామని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో గ్రామాలు అభివృద్ధిలో వెనుకబడ్డాయన్నారు. ఆ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ పూర్తి స్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగట్టాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో సర్పంచ్ కోసం పోటీ పడకుండా ఒక్కరే పోటీ చేస్తే బాగుటుందని, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్ధులను గెలిపించుకుందామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి ఉందని, దానిని ఎన్నికల అస్త్రంగా మలుచుకోవాలన్నారు.
మళ్లీ బీఆర్ఎస్ రావడం ఖాయం
రాష్ట్రంలో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం. గ్రామ రాజకీయాలను శాసించే పంచాయతీ ఎన్నికలు నాయకులకు చాలా ముఖ్యం. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికీ వెళ్లి ప్రచారం చేద్దాం. పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకుందాం. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఆ పార్టీ విఫలమ్తెంది. ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు పెడుతూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నది. అక్రమ కేసులకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. దేనికైనా నేనే ముందుండి పోరాటం చేస్త.
– డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల, కోరుట్ల ఎమ్మెల్యే