Vemulawada | వేములవాడ, జనవరి 23: వేములవాడ పురపాలక సంఘంపై బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయాలని వేములవాడ బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహారావు అన్నారు. 26వ వార్డులో మామిండ్ల జమున కనకరాజు, చందనం శ్రీనివాస్, పబ్బ శ్రీకాంత్, గంగరాజు యాదవ్, భరత్, దిలీప్ యాదవ్, శశి, కృష్ణ, సాయి వరుణ్, రాకేష్, రాజేష్, అరుణ్, సురేష్, నాగిశెట్టి, నారాయణ, దేవరాజు, రాజయ్య శుక్రవారం పార్టీలో చేరారు. కాగా వారికి ఆయన కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించి మాట్లాడారు.
పది సంవత్సరాల్లో వేములవాడను వెన్నెల వాడగా మార్చింది గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే జరిగిందన్నారు. 75 ఏళ్ల స్వాతంత్రం తరువాత వేములవాడను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దామన్నారు. వేములవాడ పురపాలక సంఘం పరిధిలో ఓటు అడిగే హక్కు ఒక్క బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉందని, మెజార్టీ స్థానాలు దక్కించుకుంటామని కూడా ఆయన చెప్పారు.
ఈ కార్యక్రమంలో మాజీ సెస్ డైరెక్టర్ రామతీర్థపు రాజు, మాజీ కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్, గోలి మహేష్, సిరిగిరి రామచందర్, నాయకులు ఇన్నాడి సత్యనారాయణ రెడ్డి, చీటి రాధా కిషన్ రావు, అంజాత్ పాషా, ప్రేమ్ చారి, దేవరాజు తదితరులు ఉన్నారు.