Huzurabad | హుజురాబాద్ మున్సిపల్ పై బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం.. రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొండాల్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని, హుజురాబాద్ మున్సిపల్ పై బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని బీఆర్ఎస్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎడవల్లి కొండల్ రెడ్డి అన్నారు.
Huzurabad | హుజరాబాద్ : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని, హుజురాబాద్ మున్సిపల్ పై బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని బీఆర్ఎస్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎడవల్లి కొండల్ రెడ్డి అన్నారు. హుజూరాబాద్ పట్టణంలోని పలు వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ విస్తృత ప్రచారం చేశారు. ఇంటింటికి వెళ్లి ఓట్లను అభ్యర్థించారు.
బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి, అమలు చేసిన పథకాలను ప్రజలకు వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం హాయంలోనే హుజురాబాద్ ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడిచిన హుజురాబాద్ కు చేసింది శూన్యం అన్నారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాల్లో ఏ ఒక్క పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే తమ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాయని, హుజురాబాద్ మున్సిపల్ పై బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. హుజురాబాద్ పట్టణ ప్రజలు ఆలోచించి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

