సిరిసిల్ల గడ్డపై.. మూడోసారి గులాబీ జెండా
సిరిసిల్ల మున్సిపల్‌పై బీఆర్ఎస్ వరుసగా మూడోసారి జెండా ఎగురవేసి, చర్రిత సృష్టించింది. 39 వార్డులకు గాను అత్యధికంగా 27 వార్డులు కైవసం చేసుకోగా, తాజాగా మున్సిపల్ పీఠం దక్కించుకున్నది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ కంచుకోటగా ఉంది.
రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 16(నమస్తే తెలంగాణ) : సిరిసిల్ల మున్సిపల్‌పై బీఆర్ఎస్ వరుసగా మూడోసారి జెండా ఎగురవేసి, చర్రిత సృష్టించింది. 39 వార్డులకు గాను అత్యధికంగా 27 వార్డులు కైవసం చేసుకోగా, తాజాగా మున్సిపల్ పీఠం దక్కించుకున్నది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ కంచుకోటగా ఉంది. 2014లో జరిగిన మున్సిపల్ ఎన్నికలతో విజయాలు ప్రారంభమయ్యాయి. అదే విధంగా 2020లోనూ 22 స్థానాలు సాధించి మున్సిపల్‌ను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. తాజాగా, జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ అదేజోరు కోనసాగించి 39 వార్డులకు 27 స్థానాలు గెలుపొంది రికార్డు సృష్టించింది.
సోమవారం జరిగిన మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించగా చైర్‌పర్సన్‌గా 3వ వార్డు కౌన్సిలర్ జిందం కళ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2020లోనూ జిందం కళ చైర్‌పర్సన్‌గా ఎన్నికై సేవలు అందించారు. ఆమె వరుసగా రెండోసారి చైర్‌పర్సన్‌గా ఎన్నికై సిరిసిల్ల మున్సిపల్ చరిత్రలో మరో రికార్డు సృష్టించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిందం కళకు వరుసగా రెండోసారి అవకాశం ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే యువ తకు ప్రాధాన్యం ఇచ్చి, వైస్‌చైర్మన్ పదవిని 34వ వార్డు కౌన్సిలర్ దార్ల సందీప్‌కు అవకాశం కల్పించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

