Heart attack | పెగడపల్లి: పెగడపల్లి మండలం దేవికొండకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్త లైశెట్టి గంగాధర్ (42) బుధవారం గుండె పోటుతో మృతి చెందాడు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న గంగాధర్ ను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం మంగళవారం కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు.
చికిత్స పొందుతూనే బుధవారం గుండె పోటుకు గురై మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకీ మొట్ట మొదటగా గ్రామ శాఖ అధ్యక్షుడిగా గంగాధర్ పని చేయగా, అతడి మృతి పట్ల మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, గ్రామ తాజా మాజీ సర్పంచ్ గొర్రె భాగ్యలక్ష్మి- ప్రశాంత్, పార్టీ మండల నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.