Pothkapalli | పోత్కపల్లి ఊర చెరువుకు బుంగ.. పూడ్చివేసిన స్థానికులు, అధికారులు
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పోత్కపల్లి ఊర చెరువుకు శుక్రవారం బుంగ పడింది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా చెరువులోకి వరద నీరు పెద్ద ఎత్తున వచ్చి చేరింది. దీంతో తూము వద్ద పెద్ద బుంగపడి నీరంతా బయటికి వెళ్లిపోతోంది.
Pothkapalli | ఓదెల, జులై 31 : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పోత్కపల్లి ఊర చెరువుకు శుక్రవారం బుంగ పడింది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా చెరువులోకి వరద నీరు పెద్ద ఎత్తున వచ్చి చేరింది. దీంతో తూము వద్ద పెద్ద బుంగపడి నీరంతా బయటికి వెళ్లిపోతోంది. దీంతో చెరువు కట్ట కోతకు గురవుతున్న విషయాన్ని మత్స్యకారులు గమనించారు. వెంటనే గ్రామపంచాయతీకి, ఇరిగేషన్ అధికారులకు సమాచారం అందించారు.
దీంతో యుద్ధ ప్రాతపదికన ప్రోక్లైన్ ను తెప్పించి బుంగపడిన ప్రాంతాన్ని పూడ్చి వేయించారు. ఈ కారణంగా చెరువు కట్టకు ప్రమాదం తప్పిందని మత్స్యకారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రెడ్డి రజనీకాంత్ గౌడ్, సింగిల్ విండో చైర్మన్ ఆళ్ల సుమన్ రెడ్డి, మేకల అనిల్, పిట్టల లక్ష్మణ్, పిట్టల ప్రశాంత్, అక్కల సుధాకర్, అంజయ్య, జంపయ్య, రాము తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

