Saidapur | సైదాపూర్, ఆగస్టు 26: సైదాపూర్ మండలంలోని రాయికల్ గ్రామంలో బావి లో పడి బాలుడు దుర్మరణం చెందాడు. రాయికల్ గ్రామానికి చెందిన కావ్య వెంకటయ్య కుమారుడు కౌశిక్ నందు తల్లి తో వ్యవసాయ బావి వద్దకు వెళ్లారు. అక్కడ తల్లి పని లో నిమగ్నమై ఉండగా బాలుడు ఆడుకుంటూ వెళ్లి బావిలో పడ్డాడు.
కాగా తల్లి కొద్దిసేపు తరువాత వెతికిన దొరకక పోవడం తో తండ్రికి సమాచారం ఇవ్వడంతో వచ్చి వెతికారు. పోలీస్ లకు సమాచారం ఇవ్వడం తో ఎసై తిరుపతి సిబ్బంది తో చేరుకొని ఫైరింజన్ సహాయం తో నీళ్లని తోడించారు. ఆదివారం రాత్రి వరకు కూడా బాలుడి ఆచూకీ లభించలేదు. సోమవారం ఉదయం బాలుడి మృతదేహం బావిలో లభించింది. ఒక్క గానోక్కా కొడుకు బావిలో పడి చనిపోవడంతో తల్లి తండ్రుల రోదనలు పలువురిని కంట తడి పెట్టించాయి. బాలుడి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.