MLA KAUSHIK REDDY | వీణవంక, ఏప్రిల్ 19 : ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ చెప్పిన విధంగా అన్ని రకాల పంటలకు బోనస్ ఇవ్వాలని ఎంఎల్ఏ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు.
మండలంలోని వీణవంక , మామిడాలపల్లి, ఇప్పలపల్లి, చల్లూరు, కనపర్తి, రామకృష్ణాపూర్, లస్మక్కపల్లి, బ్రాహ్మణ గ్రామాలలో మహిళ సంఘాల ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా మండల కేంద్రంలో ఎంఎల్ఏ పాడి కౌశిక్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులను ఇబ్బందులు పెట్టొద్దని, బార్దాన్ అందించి సకాలంలో కొనుగోలు పూర్తయ్యేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్యాక్స్ చైర్మన్ విజయ భాస్కర్ రెడ్డి, డైరెక్టర్లు మధుసూదన్, సమ్మిరెడ్డి, మల్లయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మాదాసి సునీల్, శ్రీపతి రెడ్డి, ఎంపీడీవో శ్రీధర్, ఏపీఎం కొమురయ్య, సీసీలు ఆనంద్, ఘన శ్యాం, తిరుపతి, శ్రీకాంత్, వీవోఏలు, నాయకులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.