Peddapally | పెద్దపల్లి జిల్లా టీఎన్జీవో అధ్యక్షునిగా బొంకూరి శంకర్
పెద్దపల్లి జిల్లా టీన్జీవో జిల్లా అధ్యక్షుడుగా బొంకూరి శంకర్ వరసగా నాలుగు సార్లు ఎకగ్రీవంగా ఎన్నికయ్యారు. పెద్దపల్లి జిల్లా టీఎన్జీవో సంఘం ఎన్నికలు మంగళవారం కలెక్టరేట్ ప్రాంగణంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయ కల్యాణ మండపంలో జరిగాయి.
Peddapally | పెద్దపల్లి, మే12 : పెద్దపల్లి జిల్లా టీన్జీవో జిల్లా అధ్యక్షుడుగా బొంకూరి శంకర్ వరసగా నాలుగు సార్లు ఎకగ్రీవంగా ఎన్నికయ్యారు. పెద్దపల్లి జిల్లా టీఎన్జీవో సంఘం ఎన్నికలు మంగళవారం కలెక్టరేట్ ప్రాంగణంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయ కల్యాణ మండపంలో జరిగాయి. ఎన్నికల అధికారిగా డీ శ్రీనివాస్, సహాయ ఎన్నికల అధికారిగా రవి కుమార్ వ్యవహరించారు.
జిల్లా అధ్యక్షుడిగా బొంకూరి శంకర్, ప్రధాన కార్యదర్శిగా ఆయిరెడ్డి సందీప్ రెడ్డి, అసోసియేట్ అధ్యక్షులుగా గోపు అనిత, కోశాధికారిగా ఎడ్ల కొమురయ్య, ఉపాధ్యక్షులుగా ఏ శ్రీనివాస్, ఎస్ మహేందర్ రెడ్డి, వీ శ్రీనివాస్, కే స్వప్న కుమారి, సంయుక్త కార్యదర్శులుగా ఈ ప్రవీణ్, ఎమ్ శ్రీధర్, బీ రమేష్, పీ సౌమ్య, పబ్లిసిటీ కార్యదర్శిగా డీ నిశాంత్ రావు, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా పీ అంజయ్య, ఈసీ మెంబర్లుగా శిల్ప, స్వప్న, శివధర్మతేజ, ముస్తఫా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.
ఈ సందర్భంగా బొంకూరి శంకర్ మాట్లాడుతూ, నాలుగవ సారి వరుసగా తనను ఏకగ్రీవంగా ఎన్నికవడం చాలా సంతోషంగా ఉందని, తన భాద్యత మరింతగా పెంచిందని, జిల్లా ఉద్యోగులకు ఏ సమస్య వచ్చినా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. తన ఎన్నికకు సహకరించిన ప్రతి ధన్యవాదాలు తెలుపుతూ, నిత్యం ఉద్యోగాలు అందుబాటులో ఉంటానని తెలిపారు.
నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు..
నూతనంగా ఎన్నికైన జిల్లా కమిటీకి పలువురు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా చెల్లింపులు, గణాంక అధికారి ప్రభాకర్, జిల్లా ఉపాధి కల్పన అధికారి రాజశేఖర్ నూతన కమిటీ శుభాకాంక్షలు తెలిపి, శాలువాలతో సన్మానించారు.. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి అర్బన్ అధ్యక్షుడు పురుషోత్తం రెడ్డి, పెద్దపల్లి రూరల్ అధ్యక్షుడు అమరేందర్ రెడ్డి, కార్యదర్శి ప్రేమ్ సాగర్, కోశాధికారి రామచంద్రం, రామగుండం అధ్యక్షుడు జగన్, సుల్తానాబాద్ అధ్యక్షుడు భాగ్యమ్మ, కార్యదర్శి రాజిరెడ్డి, మంథని అధ్యక్షుడు శంకర్, కార్యదర్శి పవన్ , కోశాధికారి అనిల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | నేను ట్రీట్మెంట్ చేయిస్తా.. బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న వినయ్‌కు కేటీఆర్ భరోసా.. వీడియో
Katie Zacharia: వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీగా 5 రోజులే.. జాబ్ వదిలేసిన కేట్ జచారియా
AKKA Teaser | కీర్తి సురేశ్ బర్త్‌డే స్పెషల్.. ‘అక్క’ యాక్షన్ ప్యాక్డ్ టీజర్ విడుదల!
Aakasamlo Oka Tara | పల్లెటూరి నుంచి అంతరిక్షం వరకు.. దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ టీజర్ రిలీజ్!
Road accident | ఘోరం.. అదుపుతప్పి లోయలోపడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

