Bonala celebrations | మానకొండూర్ రూరల్, జులై 19 : మండలం గంగిపల్లి శ్రీ సరస్వతి విద్యాలయం లో బోనాల పండుగ సందర్భంగా బోనాల వేడుకలను ఆ పాఠశాల కరస్పాండెంట్ రంగు శీనివాస్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో అమ్మవారి వేషధారణలో విద్యార్థులు తయారుచేసి నైవేద్యం సమర్పించి, విద్యార్థుల పోతరాజు వేషధారణలో గ్రామ దేవత అయిన పోచమ్మ గుడికి వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామ ప్రజలు సుభిక్షంగా ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురవాలని కోరుకున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమానికి మండల విద్యాధికారి మధుసూదనాచారి హాజరై పోతరాజుల విన్యాసాలను అమ్మవారి వేషధారణ చేసిన, సంస్కృతి కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నందగిరి రమేష్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ పెద్దలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.