Sircilla | గాంధీ చౌక్ : సిరిసిల్ల జిల్లా కోర్టులో బాంబు బెదిరింపు కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు కోర్టు అధికారులకు ఈ-మెయిల్ ద్వారా బాంబు పెట్టినట్లు హెచ్చరికలు పంపారు. దీంతో ఆ మెయిల్‌ను గమనించిన కోర్టు పరిపాలనా అధికారి వెంటనే పోలీసులకు సమాచారమందించారు. వెంటనే పోలీసులు, బాంబు డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు కోర్టు ప్రాంగణానికి చేరుకుని విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
రెండు గంటలపాటు కొనసాగిన ఈ సోదాల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని పోలీసులు తెలిపారు. దీంతో ఈ బెదిరింపు ఫేక్ అయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అయితే ఈ-మెయిల్ పంపిన వ్యక్తిని గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.