Woman Ded Body | యైటింక్లయిన్ కాలనీ, జూన్ 11: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ దవాఖాన మార్చురీలో గుర్తు తెలియని మహిళ శవం భద్రపర్చినట్లు గోదావరిఖని టూ టౌన్ సీఐ ప్రసాద రావు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. గత వారం రోజుల క్రితం గోదావరిఖని గంగానగర్ ప్రాంతంలో అపస్మారక స్థితిలో ఉన్న గుర్తు తెలియని మహిళను స్థానికులు గోదావరిఖని ఆస్పత్రికి తరలించారు.
అక్కడ చికిత్స చేయిస్తుండగా పరిస్థితి విషమించి మృతి చెందింది. మృతురాలి వివరాలు ఎవరైనా గుర్తిస్తే గోదావరిఖని టూ టౌన్ పోలీస్ స్టేషన్ సెల్ నం. 8712656520 ద్వారా సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.