SRSP | కోరుట్ల రూరల్, సెప్టెంబర్ 8 : జగిత్యాల జిల్లా కోరుట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని మెట్పల్లి మండలంలోని పెద్దాపూర్ ఎస్ఆర్ఎస్పీ కెనాల్లో టాక్టర్ బోల్తా పడి మెట్పల్లి మాజీ జెడ్పీటీసీ కాటిపెల్లి రాదశ్రీ-శ్రీనివాస్ రెడ్డి కుమారుడు శ్రీకర్ రెడ్డి గత నెల 27 న గల్లంతయ్యాడు.
కాగా అప్పటి నుండి పోలీసులు, బంధువులు శ్రీకర్ రెడ్డి కోసం 13 రోజులుగా గాలిస్తున్నారు. కాగా తాటి పెళ్లి గ్రామ శివారులోని ఎస్సారెస్పీ కెనాల్లో శ్రీకర్ రెడ్డి మృతదేహం సోమవారం లభ్యమైంది. కాగా విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు సంఘటనా స్థలానికి చేరుకుని బోరునవిలపించారు.