Kalvasrirampur | కాల్వశ్రీరాంపూర్, జనవరి 23 : కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వసంత పంచమి వేడుకల సందర్భంగా నాంది చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదానం శిబిరం నిర్వహించారు. 1992-1993 బ్యాచ్‌కు చెందిన పదో తరగతి విద్యార్థులు ఒక ట్రస్ట్ గా ఏర్పడి పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆ పాఠశాలలో సరస్వతి మాత విగ్రహానికి అభిషేకాలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కంటి వైద్య శిబిరం, రక్తదాన శిబిరం నిర్వహించారు.
ఈ వేడుకల్లో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి, మాజీ ఎంపీపీలు గొపగోని సారయ్య గౌడ్, నూనెటి సంపత్, మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సదయ్య, ట్రస్ట్ చైర్మన్ బెల్లంకొండ శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు కొల్లూరి హరిప్రసాద్, మండల విద్యాధికారి మహేష్, సర్పంచులు బంగారి రమేష్, జిన్నా రామచంద్రం రెడ్డి, నాయకులు గోలి సుధాకర్, ఆడెపు రాజు, మాదాసి సతీష్, తాండ్ర సురేష్, నాంది చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.