BJP leaders | రుద్రంగి, ఆగస్టు 30: నరేంద్ర మోడీ మాతృమూర్తి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను శనివారం రుద్రంగి మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు కర్ణవత్తుల వేణు ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు దహనం చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీహార్ లో జరిగిన కాంగ్రెస్ సభలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తల్లిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.
ఒక బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడిగా ఉండి రాహుల్ గాంధీ మోడీ తల్లిపై దుర్భాశలాడడం సిగ్గు చేటన్నారు. ప్రధాని మోడీ ని ధైర్యంగా ఎదుర్కోలేక కుటుంబ సభ్యులు, తల్లులపై విమర్శలు చేస్తున్న దమ్ములేని నాయకుడు రాహుల్ గాంధీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో రుద్రంగి మండల మాజీ అధ్యక్షుడు అల్లూరు అశోక్ రెడ్డి, ఉపాధ్యక్షుడు గండి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శుడు మల్యాల శ్రీనివాస్, దర్శనపు లింగయ్య, కార్యదర్శి లౌడియా శ్రీనివాస్, అక్కినపల్లి నర్సింగరావు, గడ్డం గణేష్, రాచకొండ గంగ నరసయ్య తదితరులు పాల్గొన్నారు.