Peddapally | సుల్తానాబాద్ రూరల్ జులై 7: భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కర్ర సంజీవ రెడ్డి జన్మదిన వేడుకలను సోమవారం నిర్వహించారు. జన్మదిన వేడుకలను పురస్కరించుకొని పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామంలో పార్టీ అధ్యక్షుడు కందుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, స్వీట్లు పంచిపెట్టారు. అనంతరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు భోజనం ప్లేట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆయురారోగ్యం, సుఖ సంతోషాలతో ఉంటూ భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు కడారి అశోక్ రావు, సౌదరి మహేందర్ యాదవ్, ప్రబారి సామల రాజేంద్రప్రసాద్, కొమ్ము తిరుపతి యాదవ్, మిట్టపల్లి ప్రవీణ్ కుమార్, మండల ప్రధాన కార్యదర్శి కొల్లూరి సంతోష్, మారం రమేష్, వడ్లకొండ శశివర్ధన్, కొమ్మిడి రాజేందర్ రెడ్డి, నల్లవేల్లి బాలకృష్ణ, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.