Odela | ఓదెల, అక్టోబర్ 1 : పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే, దివంగత బిరుదు రాజమల్లు 76వ జయంతి వేడుకలను ఓదెల మండల కేంద్రంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజమల్లు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ బిరుదు రాజమల్లు సుదీర్ఘకాలం ప్రజా జీవితంలో ఉంటూ ప్రజలకు విశిష్ట సేవలు అందించిన నాయకుడని అన్నారు.
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గుండేటి ఐలయ్య యాదవ్, సుల్తానాబాద్ ఏజీపీ దూడం ఆంజనేయులు, యాదవ్ బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు కందుల అశోక్, నాయకులు సామ మోహన్ కుమార్, వంగ మొండయ్య, సాధాకర్ రెడ్డి, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.