కేసీఆర్‌తోనే పద్మశాలీలకు ఆత్మగౌరవం
సీఎం కేసీఆర్‌తోనే పద్మశాలీల ఆత్మగౌరవం లభిస్తున్నదని జూలపల్లి జడ్పీటీసీ, పద్మశాలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొ ద్దుల లక్ష్మణ్ అన్నారు. గురువారం తేలుకుంటలో విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లోని కోకాపేట్లో పద్మశాలీల ఆత్మగౌరవ భవానికి రెండెకరాల స్థలం కేటాయించి రూ. 5 కోట్లు మంజూరు చేశారని తెలిపారు.
- 27న హైదరాబాద్‌లో ఆత్మగౌరవ భవన్‌కు భూమిపూజ
- రూ 5 కోట్లతో రెండున్నరెకరాల్లో నిర్మాణం
- జూలపల్లి జడ్పీటీసీ, పద్మశాలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొద్దుల లక్ష్మణ్
జూలపల్లి, మే 25: సీఎం కేసీఆర్‌తోనే పద్మశాలీల ఆత్మగౌరవం లభిస్తున్నదని జూలపల్లి జడ్పీటీసీ, పద్మశాలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొ ద్దుల లక్ష్మణ్ అన్నారు. గురువారం తేలుకుంటలో విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లోని కోకాపేట్లో పద్మశాలీల ఆత్మగౌరవ భవానికి రెండెకరాల స్థలం కేటాయించి రూ. 5 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. ఈ నెల 27న భవన నిర్మాణ పనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర మంత్రు లు టీ హరీశ్‌రావు, గంగుల కమలాకర్, సబితాఇంద్రారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, చేవెల్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, రాజేందర్‌నగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, పద్మశాలీ నేతలు ఎమ్మెల్సీ రమణ, గుండు సుధారాణి, రాపోలు ఆనందభాస్కర్, గూడూరి ప్రవీణ్, కుసుమ జగదీశ్ హాజరవుతున్నారని వివరించారు.
పద్మశాలీలు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్దసంఖ్యలో తరలివెళ్లి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. పద్మశాలీ భవన్ నిర్మాణం కోసం స్థలం కేటాయించి, నిధు లు మంజూరు చేసిన కేసీఆర్‌కు పద్మశాలీల తరఫున లక్ష్మణ్ కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వా లు పద్మశాలీలను ఏ మాత్రం పట్టించుకోలేదని ఆక్షేపించారు. కానీ కేసీఆర్ సర్కారు నేత కార్మికుల కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపడానికి బ తుకమ్మ చీరెలు, యూనిఫాంల తయారీ ఆర్డర్లు ఇచ్చి ఆదుకున్నారని చెప్పారు. చేనేత మిత్ర పథకం కింద ప్రభుత్వం కాటన్, ఉన్ని, నూలు, సిల్క్, రంగుల కొనుగోళ్లపై 40శాతం రాయితీ ఇస్తున్నదని గుర్తు చేశారు. సిరిసిల్ల, వరంగల్‌లో హాండ్లూ, టెక్స్టైల్, అప్పారెల్ పార్క్‌లు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. చేనేత, జౌళి రంగాలకు దేశ చరిత్రలో అత్యధికంగా నిధులు కేటాయిస్తున్న ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ‘నేతన్న బీమా పథకం’ అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. భవిష్యత్‌లో ఎన్నికేదైనా కేసీఆర్‌కు అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. ఇక్కడ సంఘం మండలాధ్యక్షుడు దేవసాని లక్ష్మిపతి, మేర్గు రమేశ్, చిప్ప శ్రీకాంత్, నారాయణ, సత్యనారాయణ పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

