Chigurumamidi | చిగురుమామిడి, జూన్ 22 : చిగురుమామిడి మండల కేంద్రంలో 12వ వార్డులో మురికి కాలువ నిర్మాణాలకు గాను సర్పంచ్ ఆకవరం భవాని సోమవారం వార్డు సభ్యులు, అధికారులతో కలిసి భూమి పూజ చేశారు. 15వ ఆర్థిక సంఘం నిధులచే మురికి కాలువ నిర్మాణ అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఈ సందర్భంగా సర్పంచ్ తెలిపారు.
గ్రామంలో మరిన్ని అభివృద్ధి పనులను చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ విజయలక్ష్మి, బీఆర్ఎస్ గ్రామ శాఖ మాజీ అధ్యక్షుడు ఆకవరం శివప్రసాద్, వార్డు సభ్యులు అనిల్, శ్రీనివాస్, అనిల్ కుమార్, అంజమ్మ, సమ్మయ్య, పంచాయతీ కార్యదర్శి కాల్వ రమేష్, గ్రామస్తులు పాల్గొన్నారు.