చెన్నై : అమెరికాలో చదువుకోవాలనే కల ఎంతో మందికి ఉంటుంది. కానీ అక్కడ సీటు లభించడమే కష్టతరం అనుకుంటే.. తమిళనాడుకు చెందిన ప్రణవ్ మాత్రం ఏకంగా రూ.3.55 కోట్ల ఉచిత స్కాలర్షిప్ పొందారు. అది కూడా యూఎస్‌లోని ప్రముఖ బ్రౌన్ యూనివర్సిటీలో సీటు దక్కించుకున్నాడు. ఈరోడ్‌కు చెందిన ప్రణవ్‌కు చిన్నప్పటి నుంచే యూఎస్‌లో చదువుకోవాలనే తపన ఉండేది.
13 ఏండ్ల వయసు నుంచే అమెరికా యూనివర్సిటీల నిబంధనలు, ఉచిత స్కాలర్షిప్ ఎలా పొందాలో అధ్యయనం చేశాడు. డెక్స్టెరిటీ గ్లోబల్ నేషనల్ స్కాలర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌లో చేరాడు. అక్కడ తన స్కిల్స్ పెంచుకుని బ్రౌన్ యూనివర్సిటీలో సత్తా చాటి రూ.3.55 కోట్ల స్కాలర్ షిప్‌తో సీటు దక్కించుకున్నాడు. నాలుగేండ్ల అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సు చదువుకు, ఉండటానికి ఖర్చులకు కలిపి ఈ మొత్తం కేటాయిస్తారు. అంటే అక్కడ ఖర్చులు సహా ఉచితంగా చదువుకోవచ్చు.