లక్నో : స్నేహితుడిని కారుకు కట్టేసి 2.5 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన ఘటన యూపీలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హర్దోయ్ జిల్లాకు చెందిన బబ్లూ రాథోడ్, విమ్లేశ్ రాథోడ్ స్నేహితులు. బబ్లూ దుకాణానికి వచ్చిన విమ్లేశ్.. షహాబాద్లో తనకు ఒకరు డబ్బులిచ్చేది ఉందని తనతో రావాలని పట్టుబట్టి తీసుకెళ్లాడు.
ఆ తర్వాత ఇద్దరూ పిహానీలోని బబ్లూ అత్తమామల ఇంటికి వెళ్లి భోజనం చేసి మద్యం సేవించారు. బబ్లూ ఎంతకూ ఇంటికి రాకపోవడంతో అతని కుమారుడు శివమ్ వెతుకుతూ విమ్లేశ్ ఇంటికి వెళ్లాడు.
అక్కడ విమ్లేశ్ మాత్రమే ఉండగా.. బబ్లూ కుయాన్ గ్రామ సమీపంలో తీవ్ర గాయాలతో ఉన్నాడని సమాచారం రావడంతో శివమ్ అక్కడకు వెళ్లాడు. తన తండ్రికి మద్యం తాగించి విమ్లేశ్ కారుకు కట్టి 2.5 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లాడని శివమ్ ఆరోపించాడు.