స్వయంకృషితో ఒక్కో మెట్టు పేర్చుకుంటూ సినీ పరిశ్రమలో హీరోగా ఈ స్థాయికి చేరుకున్నారు అగ్ర కథానాయకుడు నాని. తాను ఎదుగుతూ, ఎందరో దర్శకులను పరిశ్రమకు పరిచయం చేస్తూ ఓ పరిశ్రమగా అవతరించారాయన. దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం, హిట్ 3.. ఇలా వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని.. అదే ఉత్సాహంతో చేసిన మరో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ది ప్యారడైజ్’.
నానికి బ్లాక్బస్టర్ ‘దసరా’ను అందించిన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ పాన్ ఇండియా చిత్రం ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్లో విలేకరులతో ముచ్చటించారు నాని.