హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): సృజనాత్మక రచనారంగంలో విశేష కృషి చేసిన ప్రముఖ రచయిత డాక్టర్ కే శ్రీనివాసరావుకు ప్రతిష్ఠాత్మక ‘సృజనగాథ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ పురసారం’ లభించింది. అండమాన్ నికోబార్ ద్వీపంలోని పోర్ట్ బ్లెయిర్ లో ఈనెల 19నుంచి 26 వరకు జరుగుతున్న 26వ అంతర్జాతీయ హిందీ సదస్సు వేదికగా ఆయనకు అదివారం ఈ అవార్డును అందజేసి ఘనంగా సతరించారు. ఈ సందర్భంగా సృజనాత్మక రంగంలో ఆయన సుదీర్ఘకాలంగా అందిస్తున్న సేవలను నిర్వాహకులు కొనియాడారు.
హిందీ భాషా సాహిత్యాలకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడంతోపాటు విశిష్ట సాహితీవేత్తలను గౌరవించడమే లక్ష్యంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నామని తెలిపారు. సాహిత్యం, సృజనాత్మక రచనలు సమాజాన్ని సున్నితంగా తీర్చిదిద్ది భాషా సంసృతుల వికాసానికి తోడ్పడతాయని పేర్కొన్నారు. డాక్టర్ కే శ్రీనివాసరావు మాట్లాడుతూ.. తనకు పురసారం అందజేసిన నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సదస్సులో డాక్టర్ జయప్రకాశ్ మానస్, డాక్టర్ అజయ్ పాఠక్, డాక్టర్ సవిత్తా మోహన్‌తో పాటు పలువురు భాషావేత్తలు, ప్రముఖులు పాల్గొన్నారు.