వరంగల్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆదివారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బయలుదేరుతున్నారనే విషయం తెలిసి రా ష్ట్రం నలుమూలల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో వరంగల్ జిల్లాకు పోటెత్తారు. మరోవైపు ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి కేసీఆర్ కాన్వాయి బయలుదేరి హైదరాబాద్ – భూపాలపట్నం జాతీయ రహదారిపైకి (భువనగిరి దగ్గర) చేరుకొని అక్కడి నుంచి వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని పెద్ది స్వగ్రామమైన నల్లబెల్లికి చేరుకునే వరకు జనగామ, హనుమకొండ, వరంగల్, ములుగు జిల్లాల దారులకు ఇరువైపులా ఎక్కడ చూసినా జనసందోహ మే.
వందలాది మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలే కాకుండా సాధారణ ప్రజలు రోడ్లకు ఇరువైపులా నిలబడి కారులో కేసీఆర్ కనిపించగానే ఉద్యమస్ఫూర్తిని చాటారు. ‘జై తెలంగాణ.. జై కేసీఆర్ నినాదాలతో పరిసర ప్రాంతాలన్నీ మార్మోగాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా సరిహద్దుకు చేరుకోగానే ‘జై తెలంగాణ.. జై కేసీఆర్.. కేసీఆర్ నాయకత్వం వర్దిల్లాలి’ అనే నినాదాలతోపాటు ‘అమర్ రహే పెద్ది సుదర్శన్‌రెడ్డి, జోహార్.. పెద్ది సుదర్శన్‌రెడ్డి’ అంటూ జతకలిపారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ పెద్ది సుదర్శన్‌రెడ్డికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చేందుకు, నర్సంపేట నియోజకవర్గం నల్లబెల్లికి విచ్చేస్తున్న కేసీఆర్‌కు దారిలో కార్యకర్తలు పెద్ద ఎత్తున సంఘీభావం ప్రకటించారు.
పార్టీయే తమ కుటుంబమైన నేపథ్యంలో ఏ కష్టమొచ్చినా ఆదుకుంటున్న పెద్ద దికు కేసీఆర్‌కు బీఆర్ఎస్ శ్రేణులు దారిపొడవునా అభివందనం చేశాయి. కేసీఆర్‌తో కలిసి పెద్దికి నివాళులర్పించేందుకు రాష్ట్ర వ్యాప్తం గా నాయకులు కార్యకర్తలు నర్సంపేట దిశగా తరలారు. ఈ సందర్భంగా తమ అధినేతతో కలిసి నర్సంపేట నియోజక వర్గ దారులన్నీ నల్లబెల్లి వైపు మళ్లాయి. ఈ సందర్భంగా ‘అధైర్యం వద్దు.. మీకు నేనున్నాను’ అంటూ భరోసా ఇచ్చి ధైర్యం చెప్తూ, దారిలో తన కాన్వాయ్‌ను ఆపుతూ కిందికి దిగి తనకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన తన కుటుంబ సమాన పార్టీ కార్యకర్తలను కేసీఆర్ అనునయిస్తూ, ధైర్యం నింపుతూ ముం దుకు కదిలారు.
జనగామ, ఆలేరు, గూడెప్పాడ్, మల్లంపల్లి సహా పలు ప్రాంతాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కేసీఆర్ కాన్వాయ్‌పై పూలుచల్లి తమ అభిమానాన్ని చాటుకునే ప్రయత్నం చేసే సందర్భంలో కేసీఆరే స్వయంగా ‘మనం వెళ్లేది పరామర్శకు..ఇలా పూలు చల్లడం సరికాదు’ అని వారించడం గమనార్హం. కాగా, పెద్ది సుదర్శన్‌రెడ్డి చిత్రపటానికి పూ లుచల్లి నివాళి అర్పించి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పిన అనంతరం ఆయన నల్లబెల్లి నుంచి తిరుగుప్రయాణమయ్యారు. కేసీఆర్ వెంట వచ్చిన మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు సహా పార్టీ శ్రేణులకు హనుమకొండ జిల్లా మడికొండలో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతరావుపాటు వరంగల్ జిల్లా ముఖ్య నేతలతో కేసీఆర్ ముచ్చటించారు. అనంతరం ఎర్రవెల్లి నివాసానికి తిరుగు ప్రయాణమయ్యారు. అధినేత కేసీఆర్ వెంట పార్లమెంటరీ పార్టీ నాయకుడు వద్దిరాజు రవిచంద్ర, శాసనమండలి విపక్షనేత సిరికొండ మధుసూదనాచారి, డిప్యూటీ చైర్మన బండా ప్రకాశ్, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు జగదీశ్వర్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కల్వకుంట్ల సంజయ్, పాడి కౌశిక్‌రెడ్డి, అనిల్ జాదవ్, మాజీ ఎంపీలు జోగినపల్లి సంతోష్‌కుమార్, బోయినపల్లి వినోద్‌కుమార్,
మాలోత్ కవిత, ఎమ్మెల్సీలు, రాష్ట్ర నాయకులు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తకళ్లపల్లి రవీందర్రావు, శేరి సుభాష్ రెడ్డి, యాదవరెడ్డి, శంభీపూర్‌రాజు, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్, జీవన్‌రెడ్డి, డీఎస్ రెడ్యానాయక్, మాజీ ఎమ్మెల్యేలు వొడితెల సతీశ్‌కుమార్, దాస్యం వినయ్‌భాస్కర్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, గండ్ర వెంకట రమణారెడ్డి, నన్నపునేని నరేందర్, అరూరి రమేశ్, శంకర్‌నాయక్, సుంకె రవిశంకర్, భూపాల్‌రెడ్డి, చంటి క్రాంతికిరణ్, పార్టీ నేతలు ఎర్రోళ్ల శ్రీనివాస్, వై సతీశ్‌రెడ్డి, కే భరత్‌కుమార్‌రెడ్డి, వాసుదేవరెడ్డి, రాకేశ్‌రెడ్డి, రాఘవ, నాగుర్ల వెంకన్న, మర్రి యాదవరెడ్డి, సుమిత్రానంద తనోవా, రజినిసాయిచంద్, గండ్ర జ్యోతి, తాడేబోయిన విజయ్ పాల్గొన్నారు.

వరంగల్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పర్యటనలో పోలీసులు చేతులెత్తేశారు. జనగామ, గూడెప్పాడ్, మల్లంపల్లి క్రాస్ సహా పలు ప్రాంతాల్లో కేసీఆర్ కాన్వాయిని సమీపించేందుకు పరుగులు తీస్తున్న వారిని స్వయంగా గమనించిన కేసీఆర్ కారును ఆపి వారికి అభివాదం చేయడమే కాకుండా ‘పరుగులు తీయొద్దు.. నెమ్మది..నెమ్మదిగా వెళ్లండి’ అంటూ సూచించాల్సి వచ్చింది. కేసీఆర్ కాన్వాయిలో ప్రయాణిస్తున్న ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు దిగి పార్టీ శ్రేణులు, ప్రజలను సమన్వయం చేయాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ఇక దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి స్వగ్రామమైన నల్లబెల్లిలో కేసీఆర్ కాన్వాయి మొత్తాన్ని ఆపి కేవలం నాలుగైదు వాహనాలకే అనుమతినిచ్చారు. దీంతో అనేక మంది మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్యనాయకులు చాలా దూరం కాళ్లకు పనిచెప్పాల్సి రావడం గమనార్హం.
జనగామ టౌన్ : తెలంగాణ ఉద్యమ సమయంలో రోడ్లపైకి వచ్చి పోరాడిన యువత.. ఇవాళ ఉద్యమ నాయకుడు కేసీఆర్‌ను చూసేందుకు సంతోషంతో రోడ్లపైకి రావడం ప్రత్యేకంగా కనిపించింది. ఉద్యమ రోజుల జ్ఞాపకాలు మరోసారి కళ్లముందు కదలాడాయి. ఆయనపై ప్రజలకున్న అభిమానం, అనుబంధం మరోసారి రుజువైంది. ఆసరా పింఛన్లతో వృద్ధుల బాగోగులు చూసుకున్న కేసీఆర్‌ను చూసి ముసలవ్వలు, ముసలయ్యలు ఆనంద భాష్పాలు రాల్చారు. ప్రతి కుటుంబంలో ఒక ఇంటి సభ్యుడిగా ప్రజలు గుర్తిస్తూ అడుగడుగునా అపూర్వ స్వాగతం పలికారు.
– జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి

ఆత్మకూరు : గూడెప్పాడ్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పోరెడ్డి వనాకర్‌రెడ్డి ఇంట్లో కేసీఆర్ ఐదు నిమిషాలు విశ్రాంతి తీసుకున్నారు. అక్కడికి వచ్చిన వారు అధినేతతో ఫొటోలు దిగారు. అనంతరం ఆయన డ్రైఫుడ్ తిన్నారు. అనంతరం కాన్వాయ్‌తో బయలుదేరారు.
మడికొండ : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవెల్లికి వెళ్లే ముందు మడికొండలోని సత్య సాయి కన్వెన్షన్‌లో ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ నాయకులతో కొద్దిసేపు సమావేశమయ్యారు.

ఆ తర్వాత మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతారావుతో ప్రత్యేకంగా ముచ్చటించారు. కాగా, మాజీ ము ఖ్యమంత్రి వస్తున్నారని తెలిసి వేల సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. ఆయన బయలుదేరుతున్న సమయంలో పార్టీ శ్రేణులు, అభిమానులు సీఎం.. సీఎం.. అంటూ నినాదాలు చేశారు. తమ సెల్‌ఫోన్ కెమెరాల్లో కేసీఆర్‌ను ఫొటో తీసేందుకు పోటీపడ్డారు.







